80 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

80 కిలోల గంజాయి పట్టివేత

Aug 5 2026 2:35 AM | Updated on Aug 5 2026 2:35 AM

80 కిలోల గంజాయి పట్టివేత

శంకర్‌పల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సోమవారం రాత్రి శంకర్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. శంకర్‌పల్లి సీఐ రుధ్వీర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన ఎం శ్రీనివాస్‌, ఎం శ్రీనివాస్‌, జే కిరణ్‌ కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణాను ఎంచుకున్నారు. ఒడిశాలోని చిత్రకొండ వద్ద 80 కిలోల గంజాయి కొనుగోలు చేసి, కర్ణాటకలోని బీదర్‌లో విక్రయిస్తున్నారు. సోమవారం శంకర్‌పల్లి నుంచి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పట్టణంలోని మంజీరా పైప్‌లైన్‌ రోడ్డులో తనిఖీలు జరుపగా వీరు పట్టుబడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, సంగారెడ్డి జిల్లా జైలుకి తరలించారు.

రిమాండ్‌కు ముగ్గురి తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement