వివరణ ఇచ్చేదెలా? | - | Sakshi
Sakshi News home page

వివరణ ఇచ్చేదెలా?

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

కొనసాగుతున్న ఫామ్‌ల స్వీకరణ

జిల్లాలో నోటీసు ప్రక్రియ ఇలా..

నిజామాబాద్‌అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నోటీసుల జారీ, వివరణ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వయస్సు ఽధ్రువీకరణ తే డా పేరుతో చాలామందికి నోటీసులు అందుతున్నాయి. నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లీకి చెందిన తిరుమల్‌ వయస్సు 22 సంవత్సరాలు.. కాగా అత డి తండ్రికి 47 ఏళ్లు. అయితే ఇద్దరి మధ్య 70 సంవత్సరాల వయస్సు తేడా ఉందంటూ నోటీసు ఇచ్చారు. చంద్రశేఖర్‌ కాలనీకి చెందిన ఓ మైనారిటీ మహిళకు హిందూ కుటుంబంలోని సభ్యురాలిగా పేరు నమోదు చేశారు. తన పే రు తన కుటుంబ సభ్యులతో ఓటర్‌ లిస్టులో లేదని ప్రశ్నించగా.. హిందూ కుటుంబంలోని మరో ఫ్యా మిలీలో ఆమె పేరును చేర్చారు. తనకు తెలియకుండానే మరో కుటుంబంలోకి పేరు మార్చడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటువంటి తప్పిదాలే కాకుండా మ్యాపింగ్‌ ప్రక్రియలో బీఎల్‌వోల హడావుడి కారణంగా వయస్సు, చిరునామా, ఇంటి నంబర్‌తోపాటు అనేక తప్పిదాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటికి నోటీసులు అందుకున్న ఓటర్లు అధికారుల వద్దకు వెళ్లగా వాటిని సవరణ కోరుతూ మరికొన్ని ధ్రువపత్రాలు తీసుకురావాలని సూచిస్తున్నారు. జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌ నగరంలోనే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. చాలాచోట్ల ఎస్‌ఐఆర్‌ ఫామ్‌లు అందించకుండానే పాత ఓటరు లిస్ట్‌ ప్రకారం నమోదు చేసి మ్యాపింగ్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో ఫామ్‌ – 6కు సంబంధించి(కొత్త ఓటర్ల నమోదు) దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా, విచారణ నామమాత్రంగానే సాగుతోంది. ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 31,461 దరఖాస్తుల స్వీకరించగా 11108 దరఖాస్తులు పెండింగ్‌ లో ఉన్నాయి.

సరైన కారణాలు చూపకుండానే

నోటీసులు

ఆందోళనకు గురవుతున్న ఓటర్లు

గందరగోళంగా నోటీసులు,

వివరణల ప్రక్రియ

బీఎల్‌వోల వద్దే తప్పిదాలు

జరిగాయంటున్న ఓటర్లు

ఆర్మూర్‌ నియోజకవర్గంలో 63,179 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా.. 62,165 మందికి అందజేశారు. బోధన్‌ నియోజకవర్గంలో 61,261 నోటీసులకు గాను 61,248 మందికి అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో 52,919 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, 52,534 మందికి అందజేశారు. నిజామాబాద్‌ అర్బన్‌లో 1,09,639 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, 1,09,640 మందికి నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్‌ రూరల్‌లో 80,025 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉండగా అందరికీ అందజేశారు. అలాగే బాల్కొండ నియోజకవర్గంలో 65,378 మందికిగాను 65,374 మందికి నోటీసులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement