వేల్పూర్(మెండోరా): వర్షాలు తగ్గుముఖం పట్టి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంటోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1042 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 46.057 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 150 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతల పథకానికి 405, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 360, మిషన్ భగీరథ పథకానికి 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరిరూపంలో 502 క్యూసెక్కుల నీరు పోతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.


