ముస్తాబవుతున్న గోదావరి తీరం | - | Sakshi
Sakshi News home page

ముస్తాబవుతున్న గోదావరి తీరం

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

● వచ్చే ఏడాది జులైలో గోదావరి

మహా పుష్కరాలు

● కందకుర్తి త్రివేణి సంగమం వద్ద

అభివృద్ధి పనులు ప్రారంభం

రెంజల్‌: మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమక్షేత్రం గోదావరి పుష్కరాల కోసం ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జూలై నెలలో గోదావరి మహా పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో కందకుర్తి వద్ద ఎట్టకేలకు పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకో సం ప్రభుత్వం పలు శాఖల ద్వార రూ. 30 కోట్ల ని ధులు మంజూరు చేసింది. ఇటీవలనే ప్రభుత్వ ప్ర ధాన సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్‌ భువేశ్‌తో కలిసి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రతిపాదన లు, టెండర్ల దశలో ఉన్న పనులకు ప్రభుత్వం ఆ మోదం లభించడంతో కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయిలో పనులను చకచక నిర్వహిస్తున్నారు. పుష్కరాలకు స మయం దగ్గర పడటంతో నిర్ణీత సమయంలో పూర్తి చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు కందకుర్తికి సుమారు 26 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈనేపథ్యంలో రానున్న పుష్కరాలకు సైతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు కందకుర్తి విశిష్టతను తెలుసుకుని ఎక్కువ సంఖ్యలో వస్తారని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు ఘాట్‌తోపాటు గోదావరి ఒడ్డున ఆలయ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. వీటితోపాటు రోడ్లు, తాగు నీరు, విద్యుత్‌, పారిశుద్ధ్య, పార్కింగ్‌, మరుగుదొడ్లు, వీఐపీల విడిది వంటి సౌకర్యాలను అందించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement