మధ్యాహ్న భోజనం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం పరిశీలన

Jul 8 2026 1:44 AM | Updated on Jul 8 2026 1:44 AM

వేల్పూర్‌: మండలం కుకునూర్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ భుజంగరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూళ్లలో విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనం, వంటశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును, స్కూలు రికార్డులను పరిశీలించారు. హైస్కూల్‌కు ఇచ్చిన టార్గెట్‌ కంటే 30 శాతం అధికంగా విద్యార్థులకు చేర్పించడంపై హెచ్‌ఎం హరిచరణ్‌ను అభినందించారు. సర్పంచ్‌ భూమారెడ్డితో కలిసి మొక్క నాటారు.హెచ్‌ఎంలు హరిచరణ్‌, హరిప్రసాద్‌, టీచర్లు పతాని గంగాధర్‌, మల్కన్న, చరణ్‌దాస్‌, రవీందర్‌, నాగరాజు, శ్రీధర్‌రావు, అశోక్‌, హరిత, నాగేంద్ర, నరేందర్‌,స్రవంతి,తేజస్విని, రామకృష్ణ,జీపీ కార్యదర్శి హరిత, అంగన్‌వాడీ టీచరు భారతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement