● మహిళను కట్టివేసి, బంగారం,
వెండిని అపహరించిన దుండగులు
బోధన్‌టౌన్(బోధన్): జనగణన సర్వే పేరు తో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొర బడి, మహిళను కట్టేసి బంగారం, వెండిని అపహరించిన ఘటన పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. రాకాసీపేట్‌లోని గౌడ్స్ కాలనీ లో మౌనిక అనే మహిళ ఇంటికి శనివారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జనగణన సర్వే చేస్తున్నామంటూ వచ్చారు. కుటుంబసభ్యుల వివరాలు తెలుపాలంటూ, మంచినీళ్లు కావాలని మహిళను అడిగా రు. ఆమె నీళ్ల కోసం వెళ్లగా, దుండగులు ఇంట్లోకి ప్రవేశించి, చున్నీతో ఆమె కాళ్లు, చేతు లను కట్టేసి, చంపుతామని బెదిరించారు. అనంతరం ఆమె మెడలోని బంగారు ఆభరణాలు, ఇంట్లో ఉన్న వెండి వస్తువులను ఎ త్తుకుపోయారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి, పోలీసులకు సమా చారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. ఈ ఘటనలో 4.7తులాల బంగారం, 68 తులాల వెండి చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని సీఐ వెంకటనారాయణ వెల్లడించారు.
ఖరీఫ్‌కు ముందే
నీటి సరఫరా
● మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్: జిల్లా రైతులకు భారీ ఊతమిచ్చే జాకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం త్వరలోనే ప్రారంభించి ఖరీఫ్ సీజన్‌కు ముందే సాగునీరు అందించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.106.04 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వర్ని, చందూర్, మోస్రా మండలాల్లోని 7,975 ఎకరాలకు సాగునీరు అందనున్నదని, ప్రధానంగా బాన్సువాడ నియోజకవర్గ రైతులకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని, ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించామని మంత్రి వెల్లడించారు. ఆధునిక పంప్‌హౌస్‌లు, పైప్‌లైన్‌లు, కాలువల నెట్‌వర్క్‌తో నీటి పంపిణీ వ్యవస్థను సమర్థంగా రూపొందించినట్లు తెలిపారు. కొద్దివారాల్లోనే ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించి, ప్రాంతీయ రైతులకు అంకితం చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి
● పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
● జీజీహెచ్‌లో డీ అడిక్షన్ కేంద్రం ప్రారంభం
సుభాష్‌నగర్: పిల్లలను విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి రెండో అంతస్తులో డ్ర గ్స్‌కు బానిసైన వారి చికిత్స కేంద్రాన్ని (డీ అడిక్షన్ ట్రీట్‌మెంట్ సెంటర్) ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్, ఆల్కాహాల్‌ను ఏ రూపంలో తీసుకున్నా.. ఎంత మొత్తంలో తీసుకున్నా.. డ్రగ్స్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం చట్ట వ్యతిరేకం అవుతుందని వివరించారు. అనంతరం ఫార్మసీ, మెడికల్ కళాశాలలో డ్ర గ్స్, వివిధ అంశాలపై నిర్వహించిన వ్యాస రచన, క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సీపీ సాయిచైతన్య, డీఎంహెచ్‌వో రాజ శ్రీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్ట ర్ శ్రీనివాస్, ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ నాగమోహన్, పీవో ఎన్‌సీడీ డాక్టర్ వెంకన్న, సైకియాట్రిస్ట్ రవితేజ, రాజేందర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీకాంత్, శ్రీలత, వైద్య కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


