లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మెంగారం గ్రామానికి చెందిన కొమ్ముల రవి(30) అనే యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవి గత శనివారం డీసీఎం వ్యాన్ తీసుకొని మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు వెళ్లాడు. అక్కడ పుచ్చకాయలు లోడ్ చేసుకొని గత సోమవారం హైదరాబాద్‌లోని నాగోల్‌కు వెళ్లాడు. సోమవారం రవి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో అదృశ్యం అయినట్లు తెలిపారు. వారం రోజులుగా బంధువులు, స్నేహితుల వద్ద గాలించినా అతడి ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలిస్తున్నట్లు తెలిపారు.


