అడ్డంకులు రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

అడ్డంకులు రానీయొద్దు

Apr 10 2026 9:39 AM | Updated on Apr 10 2026 9:39 AM

అధికారులకు సీఐఎస్‌ డిప్యూటీ

కమాండెంట్‌ శివకుమార్‌ ఆదేశం

11న కందకుర్తిలో మోహన్‌

భగవత్‌ పర్యటన

రెంజల్‌(బోధన్‌): ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ పర్యటనలో అడ్డంకులు తలెత్తకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సీఐఎస్‌ డిప్యూటీ కమాండెంట్‌, ప్రోగ్రాం సూపర్‌వైజర్‌ శివకుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 11న రెంజల్‌ మండలం కందకుర్తిలో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ పర్యటించనున్న నేపథ్యంలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలోని పలు శాఖల అధికారులతో గురువారం సమీక్షా స మావేశాన్ని నిర్వహించారు. మూడు జిల్లాల్లో సు మారు 230 కిలోమీటర్ల వరకు మోహన్‌ భగవత్‌ ప్రయాణం ఉంటుందన్నారు. సెక్యూరిటీ విషయంలో బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పోలీసులు ఎస్కార్ట్‌ను కల్పించాలన్నారు.

వంటలను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పరిశీలించిన తర్వాతే అతిథులకు అందించాలన్నారు. బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, ఏసీపీ శ్రీనివాస్‌, రూ రల్‌ సీఐ విజయ్‌బాబు, తహసీల్దార్‌ శ్రావణ్‌కుమా ర్‌, ఎస్సై చంద్రమోహన్‌తోపాటు ఆయా జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement