13 నుంచి ‘అరైవ్‌ – అలైవ్‌’ | - | Sakshi
Sakshi News home page

13 నుంచి ‘అరైవ్‌ – అలైవ్‌’

Apr 10 2026 9:39 AM | Updated on Apr 10 2026 9:39 AM

ప్రజాప్రతినిధులను

భాగస్వాములను చేయాలి

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి,

సీపీ సాయిచైతన్య ఆదేశం

నిజామాబాద్‌అర్బన్‌: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు కొనసాగనున్న ‘అరైవ్‌ – అలైవ్‌’ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్యతో గురువారం హైదరాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

వీసీ అనంతరం కలెక్టర్‌, సీపీ ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలపై ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన ‘అరైవ్‌ – అలైవ్‌’ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారుల అందరిపై ఉందన్నారు. వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాలను భాగస్వాములు చేయాలని అన్నారు. 13 నుంచి 18వ తేదీ వరకు నిర్దేశిత కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో ‘అరైవ్‌ – అలైవ్‌’ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేలా అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దిలీప్‌కుమార్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement