● రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి
తెయూ(డిచ్‌పల్లి): మహనీయులు చూపిన మార్గంలో ముందుకు సాగినప్పుడే వారికి నిజమైన నివాళి అని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాల్లో రిజిస్ట్రార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నేర్చుకున్న విద్యను సమాజ అభ్యున్నతికి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడేలా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాంబాబు, బీసీ సెల్ డైరెక్టర్, వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ వాణి, ఉమెన్ సెల్ డైరెక్టర్ భ్రమరాంభిక, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


