ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేవి విశ్వవిద్యాలయాలే | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేవి విశ్వవిద్యాలయాలే

Mar 12 2026 7:15 AM | Updated on Mar 12 2026 7:15 AM

ఏఎస్పీ చైతన్య రెడ్డి

సౌత్‌క్యాంపస్‌లో

విద్యార్థులకు కౌన్సెలింగ్‌

భిక్కనూరు: సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా విశ్వవిద్యాలయాలు తీర్చిదిద్దుతాయని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ యూ నివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండాలన్నారు. నేటి విద్యార్థి రేపు సమాజంలో గుర్తింపు పొందే వ్యక్తిగా ఎదిగినప్పడు తమ స్నేహితుడు ఉన్నత స్థానానికి ఎదిగాడని గర్వంగా చెప్పుకునే విధంగా తయారు కావాలన్నారు. సీనియర్‌లు జూనియర్‌లకు మార్గదర్శకులుగా ఉండి వారిని సో దరులుగా భావించుకోవాలన్నారు. జూనియర్‌లు తమకు తెలియని విషయాలను సీనియర్‌ విద్యార్థులను అడిగి తెలుసుకోవాలన్నారు. సీఐ సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నో ఆశలు, ఆశయాలతో తల్లిదండ్రులు తమ జీవితాలను త్యాగం చేస్తూ విద్యార్థులను చదివిస్తున్నారని దీన్ని గుర్తుంచుకుని విద్య అభ్యసించాలన్నారు. పనికిరాని విషయాల్లో తలదూర్చి ఇబ్బందుల్లో పడవద్దని హెచ్చరించారు. ఎస్సై అంజనేయులు.. ర్యాంగింగ్‌ వల్ల జరిగే పరిణామాలు, శిక్షలు, చట్టాల గురించి పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రిన్సిపాల్‌ సుధాకర్‌గౌడ్‌, అధ్యాపకులు లలిత, యాలాద్రి, సరిత, సబిత, నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement