నదిలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి
బోధన్‌రూరల్: మంజీర నదిలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు నీటిలో గల్లంతై, మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బుధవారం మధ్యాహ్నాం ఇదే మండలంలోని ఖండ్‌గాం గ్రామ శివారులోగల మంజీర నదికి వెళ్లారు. ముగ్గురు యువకులు స్నాన్నాలు చేస్తుండగా, నీలం అమితేశ్(18) అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారిలో నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంలో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లలో నదిలో గాలించి అమితేశ్ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కరెంట్ షాక్‌తో రైతు ..
వర్ని: మండలంలోని జాకోర గ్రామంలో ఓ రైతు కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. జాకోర గ్రామానికి చెందిన గట్టు మీది గంగాధర్ (36) బుధవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. పొలంలోని మోటారు వైరును సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతుడు వ్యవసాయంతోపాటు గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నాడు.


