● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● మోకన్‌పల్లి కేజీబీవీ తనిఖీ
● సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ
నవీపేట: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ ని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని మోకన్‌పల్లి గ్రామంలోని కేజీబీవీని బుధవారం ఆ మె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బది హా జరు రిజిస్టర్లను పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రత్యేక అధికారి కవితను మందలించారు. బాలికలు ఉండే వసతిగృహంలోకి బ యటి వ్యక్తులను ఎందుకు రానిచ్చారని మండిపడ్డా రు. విద్యార్థినుల భద్రత, సంక్షేమంపై నిర్లక్ష్యం వ హించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకా రం భోజనం వడ్డించే విధంగా జాగ్రత్త వహించాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి బోధనాతీరును పరీక్షించారు. ఏమైనా సమస్యలుంటే నిర్భయంగా చె ప్పాలని విద్యార్థినులకు సూచించారు. విధుల నిర్వ హణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేజీబీవీ ప్రత్యేక అధికారి కవితతోపాటు గెస్ట్ ఫ్యాకల్టీ రాజశ్రీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇరువురి వేతనాలను నిలిపివేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అధికా రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


