అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయించాలి

Mar 12 2026 7:15 AM | Updated on Mar 12 2026 7:15 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ వినతి

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ అర్బన్‌ ని యోజకవర్గంలో అభివృద్ధి పనులను త్వరితగతి న పూర్తిచేయించాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ కోరారు. ఈమేరకు బుధవా రం ఆయన కలెక్టర్‌ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌లపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరతగతిన పూర్తి చేసి, అర్హులైన నిరుపేదలకు అందించే విధంగా ప్రణాళికలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన యూజీడీ నిధుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి సూచించారు. బోధన్‌ బస్టాండ్‌ సమీపంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ మరమ్మతులను పూర్తిచేసి అర్హులైన వారికి కేటాయించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement