జాబ్‌ మేళా విజయవంతం | - | Sakshi
Sakshi News home page

జాబ్‌ మేళా విజయవంతం

Mar 12 2026 7:15 AM | Updated on Mar 12 2026 7:15 AM

జాబ్‌ మేళా విజయవంతం మహిళా డిగ్రీ కాలేజీలో వర్క్‌షాప్‌ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ డి గ్రీ కాలేజీలో గురువారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళా విజయవంతమైనట్లు, సుమారు 152 మంది యువతీయువకులు ఉద్యోగాలు పొందినట్లు ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌, తెయూ మాజీ పాలకవర్గ సభ్యుడు మారయ్య గౌడ్‌ తెలిపారు.మ్యాజిక్‌ బస్‌ సహకారంతో జరిగిన ప్రాంగణ నియామకాలలో టెక్‌ మహేంద్ర, జియో, ఐడీబీఐ బ్యాంక్‌, మెడిప్లస్‌తోపా టు 24 ప్రముఖ కంపెనీలు ప్రాంగణ నియమకాలు చేపట్టారన్నారు. వివిధ కంపెనీలలో సుమారు 700 మంది ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా విద్యార్థులు తమ వివరాలు నమోదు చే సుకొని,పాల్గొన్నారన్నారు.ఎంపికై న వారికి ని యామక పత్రాలను మారయ్యగౌడ్‌ అందజేశా రు. టీపీవోలు స్వప్న, మహేశ్‌, అధ్యాపక బృందం, మాజిక్‌ బస్‌ సిబ్బంది బాలకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ వేణుగోపాల్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, విద్యార్థులు ఉన్నారు.

ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం భౌతికశాస్త్ర విభాగం అధ్వర్యంలో ‘క్వాంటం ఇంటెలిజెన్స్‌ ది నెక్ట్స్‌ లిప్‌ ఇన్‌ ఏఐ ఆప్టిమైజేషన్‌‘ అనే అంశంపై ఒక రోజు వర్క్‌ షాప్‌ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ భారతిరెడ్డి తెలిపారు. ఈ వర్క్‌ షాప్‌కు ముఖ్య అతిథిగా రామకృష్ణ హాజరై, మాట్లాడారు. విద్యార్థులకు క్వాంటం ఇంటెలిజెన్స్‌, కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ఆధునిక ప్రాధాన్యాన్ని పరిచయం చేయడం జరిగిందన్నారు. కళాశాల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కళాశాల యాజమాన్యం, భౌతికశాస్త్ర అధ్యాపకులు మాధవి, సంతోషి రాణి, విద్యార్థినులు పాల్గొన్నారు.

బోధన్‌టౌన్‌(బోధన్‌): కేంద్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న పీఎం ముద్ర యోజన, స్టార్టప్‌ ఇండియా, పీఎం స్వనిధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ రిసోర్స్‌ పర్సన్‌ శ్రీవాణి, ప్రొఫెసర్‌ లు టార్కర్‌ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం వాణిజ్యశాస్త్రం ఆధ్వర్యంలో ‘సమ్మెళిత వృద్ధికి వ్యవస్థాపకత, ప్ర భుత్వ ఆర్థిక పథకాల పాత్ర’ అనే అంశాలపై సెమినార్‌ నిర్వహించారు. కార్యక్రమానికి వా రు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతోపాటు యువతకు అందిస్తున్న ఉపాధి కల్పన అవకాశాలను నేటి యువత వినియోగించుకోవాలని సూచించా రు. ఇండోర్‌ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ మదన్మోహన్‌, వెల్‌నెస్‌ ఆస్పత్రి ఎండీ సుమన్‌ గౌడ్‌, టీ యూ ప్రొఫెసర్లు ఆంజనేయులు, రాంబాబు, కళాశాల ప్రిన్సిపాల్‌ సురేష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌రావ్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ మారుతి రావ్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement