రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేద్దాం
ధర్పల్లి: ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేద్దామని జిల్లా రవాణాశాఖ అధికారులు పిలుపునిచ్చారు. మండలంలోని రామడు గు విజ్ఞాన్ హైస్కూల్‌లో జాతీయ రోడ్డు భద్రత మా సోత్సవాలను పురస్కరించుకొని గురువారం జిల్లా రవాణా శాఖ అధికారులు విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అధికారులు కిరణ్ కుమార్, వాసుకి, పవన్ కళ్యాణ్, స ర్పంచ్ రమేష్‌గౌడ్, ఉపసర్పంచ్ రాజేశ్వర్, కరస్పాండెంట్ రాజు, హెచ్‌ఎం సుజాత,టీచర్లు ఉన్నారు.
మోపాల్: మండలంలోని కంజర్ గ్రామంలో పోలీస్ కళాబృందం, ట్రాఫిక్ పోలీసులతో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుముందు విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఎస్సై సుస్మిత మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు.


