నిబంధనలు పాటించని కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
తెయూ(డిచ్‌పల్లి): నిబంధనలను పాటించని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని నిషిత డి గ్రీ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు గురువారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. నాయకు లు బోడ అనిల్, కళ్యాణ్, శ్రీశైలం, గోపాల్‌సింగ్ ఠాగూర్, అరుణ్ తేజ, నవీన్, శివ, సునీల్ పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: తమకు బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ఏఐటీయూసీ నేతలతో కలిసి గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ.. గత ఆగస్టు నెల నుంచి మధ్యా హ్న భోజన కార్మికులకు బిల్లులు రావడం లేదన్నారు. జిల్లాకు రూ.8కోట్లు బకాయిలు రావా ల్సి ఉందన్నారు. వెంటనే అధికారులు బకాయిలను చెల్లించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. నాయకులు చక్రపాణి, స్రవంతి, సాయమ్మ, గంగమణి, నాగలక్ష్మీ, సుజాత ఉన్నారు.
నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు 3వ వేతన సవరణ అమలు చేయాలని ఆల్ యూనియన్స్, అసోసియేషన్స్ ఆఫ్ భారత్ సంచార్ నిగమ్ లిమిటేడ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు గురు వారం నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాల యం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. తమిళనాడు, చైన్నె సర్కిల్స్‌లో అక్రమంగా చేసిన అసోసియేషన్ నాయకుల బదిలీలను వెంటనే ఆపివేయాల న్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించా లన్నారు. నాయకులు నారాయణ, సాయిలు, సాయన్న, ఆశంశెట్టి, సందీప్ రాటి, రాజేందర్, రాజేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయి: మండలంలోని ప్రభుత్వ కార్యా లయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల ని బీజేపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాల్లోకి తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇందల్వాయి ఎంపీడీవో కార్యాలయాన్ని ఇందల్వాయి రైతు వేదికలోకి తరలించడానికి అధికారులు గురువారం ఏర్పాట్లు చేశారు. దీంతో మండలంలోని పలు గ్రామల సర్పంచ్‌లు, బీజేపీ నాయకులు ఎంపీడీవో కార్యాలయాన్ని మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని ఎంపీవో రాజ్‌కాంత్‌కి వినతిపత్రం అందించారు. నల్లవెల్లి సర్పంచ్ రాజేందర్, బీజేపీ నాయకులు శ్రావణ్ ,ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం ఎంపీడీవో సతీష్ కుమార్ తనిఖీ చేశారు. పాఠశాలలో స్టోర్ రూమ్, వంట గదిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపల్ స్వప్న, ఏపీవో రవి తదితరులు ఉన్నారు.
ఖలీల్‌వాడి: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో గురువారం కామర్స్, బిజినెన్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో గురువారం రిచర్స్ మెథడాలజీ ప్రాజెక్ట్‌పై రిపోర్ట్ ప్రిపరేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ పీవీవీ సత్యప్రసాద్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌కు సంబంధించిన అంశాలను విద్యార్థులకు వివరించారు.
నిబంధనలు పాటించని కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
నిబంధనలు పాటించని కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
నిబంధనలు పాటించని కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
నిబంధనలు పాటించని కళాశాల గుర్తింపును రద్దు చేయాలి


