జీవాలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి
మోపాల్: ప్రభుత్వం గొర్రెలు, మేకలకు వ్యాధి నివారణా టీకాల పంపిణీని ఉచితంగా చేపడుతుందని, పెంపకందారులు టీకాలను జీవాలకు తప్పనిసరి వేయించాలని జిల్లా పశువైద్యాధికారి గంగాధరయ్య సూచించారు. మండలంలోని కాల్‌పోల్ గ్రామంలో గురువారం జీవాలకు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏడీ బస్వారెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవాలు వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం అందజేస్తున్న టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 860 గొర్రెలు, 160 మేకలకు టీకాలు పంపిణీ చేశామని మండల పశువైద్యాధికారి శిరీష పేర్కొన్నారు. సర్పంచ్ రవి, సిబ్బంది మురారీ, బాబు తదితరులు పాల్గొన్నారు.


