సంక్షిప్తం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం

Jan 9 2026 7:46 AM | Updated on Jan 9 2026 7:46 AM

సంక్ష

సంక్షిప్తం

ఆర్మూర్‌ సీఐపై చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌ అర్బన్‌: ఆర్మూర్‌ సీఐ సత్యనారాయణపై చర్య లు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు గురువారం క లెక్టర్‌ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ ర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన రాజేశ్వర్‌ను అ కారణంగా పోలీస్‌స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేసి నట్లు వారు పేర్కొన్నారు. నాయకులు ప్రమోద్‌, పోశెట్టి, గంగారాం, నాగభూషణం, యమున, రాజేందర్‌ ఉన్నారు.

ఘనంగా వివేకానంద జయంతి

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని అర్సపల్లి ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో గురువారం సొసైటీ సోల్జర్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. అనంతరం ఎస్సెస్సీ విద్యార్థులకు బిట్‌ బ్యాంక్‌ను అందజేశారు. నార్త్‌ మండలం విద్యాధికారి వెంకట్‌ నారాయణ, ఉపాధ్యాయులు ఉన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన నేతలు

జక్రాన్‌పల్లి: నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని గురువారం జక్రాన్‌పల్లి గ్రామ కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్తులు కలిసి సన్మానించారు. నాయకులు సత్యం, నర్సారెడ్డి, వినోద్‌, అక్బర్‌, జితేందర్‌ నాయక్‌, గంగాధర్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ సభ్యులు..

ధర్పల్లి: మండలంలోని దుబ్బాకలోగ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు గురువారం రూరల్‌ ఎమ్మెల్యే భూ పతిరెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి దేశెట్టి మురళి జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయినట్లు పాఠశాల పీడీ గంగా మోహన్‌ తెలిపారు. ఈసందర్భంగా గురువారం పాఠశాలలో మురళిని ఉపాధ్యాయ బృందం అభినందించారు.

విద్యార్థులకు వాటర్‌ బాటిల్స్‌ పంపిణీ

జక్రాన్‌పల్లి: మండలంలోని బాలానగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం విద్యార్థి గౌతమ్‌ జ న్మదినం పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు వాటర్‌ బాటిల్స్‌ పంపిణీ చేశారు. సర్పంచ్‌ కొమిరె రాజు, ఉపసర్పంచ్‌ బోదాస్‌ శ్రీనివాస్‌,వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మహిళా ఉద్యోగులకు సన్మానం

సిరికొండ: మండల కేంద్రంలోని సత్యశోధక్‌ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గురువారం మహిళా ఉద్యోగులను ఎంపీడీవో కేఆర్‌ మనోహర్‌రెడ్డి సన్మానించారు. ప్రిన్సిపాల్‌ నర్సయ్య, స్కౌట్స్‌ గైడ్స్‌ ప్రతినిధి సోలామన్‌, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బాలయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పోడు సమస్యలపై వినతి

సిరికొండ: కామారెడ్డి జిల్లా గాంధారిలో నిర్వహించిన సమావేశంలో గురువారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డిని మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు మాలా వత్‌ రవినాయక్‌ కలిశారు. పోడు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం చైర్మన్‌ను సన్మానించారు.

సర్పంచ్‌కు సన్మానం

జక్రాన్‌పల్లి: మండలంలోని వివేక్‌నగర్‌ తండా సర్పంచ్‌గా ఎన్నికై న మోజీరాంను చిన్ననాటి స్నేహితులు గురువారం సన్మానించారు. కాట్‌పల్లి నర్సారెడ్డి, పిప్పెర గంగాధర్‌, బండి సత్యం, తిరుపతిరెడ్డి, విజయ్‌, జితేందర్‌నాయక్‌, భూషన్‌, గంగాధర్‌, గుడ్ల శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, గంగాధర్‌, భూ మేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

సిర్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌కు విరాళం..

మోపాల్‌: మండలంలోని సిర్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయురాలు లలిత గురువా రం పాఠశాల అభివృద్ధి కోసం రూ.38వేల విరాళాన్ని అందించారు. అనంతరం లలితను సర్పంచ్‌, వీడీసీ ప్రతినిధులు సన్మానించారు. హెచ్‌ఎం సత్యనారాయణ, సర్పంచ్‌ బొడ్డు గౌతమి, ఉపసర్పంచ్‌ భాస్కర్‌, వీడీసీ ప్రతినిధులు ఉన్నారు.

స.హ.చట్టంపై అవగాహన

ఖలీల్‌వాడి: నగరంలోని పులాంగ్‌లోగల ప్రభుత్వ పాఠశాలలో గురువారం సమాచార హక్కు చట్టంపై చైతన్య సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్‌ కోయడి నర్సింలుగౌడ్‌, ప్రతినిధులు రాంరాజ్‌ రాథోడ్‌, ప్రధాన కార్యదర్శి గంగాధర్‌, హెచ్‌ఎం నాగరాజు, సిబ్బంది రఫత్‌, నిఖిత, గంగాధర్‌, అశోక్‌ ఉన్నారు.

ఇందూరుగా పేరు మార్చాలి

సుభాష్‌నగర్‌: జిల్లా పేరు నిజామాబాద్‌ కాకుండా ఇందూరుగా మార్చాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పల్నా టి కార్తీక్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని మార్కండేయ మందిరం వద్ద గురువారం వారు యువకులతో కలిసి నినాదాలు చేశారు. నాయకులు, యువకులు నిరంజన్‌, జగన్‌, శ్రీను, రాకేష్‌, చరణ్‌, కారంపురి నర్సయ్య, ప్రశాంత్‌, చరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

తల్లీకూతుళ్ల అదృశ్యం

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గూ పన్‌పల్లికి చెందిన దండ్ల పూజారి వెన్నెల, తన కూతురు అ మృత(సంవత్సరంన్నర) అదృశ్యమైనట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం తన కూతురుతో బయటకు వెళ్లిన వెన్నెల ఇప్పటికీ తిరిగి ఇంటికి రాలేదు. వెన్నెల భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంక్షిప్తం1
1/4

సంక్షిప్తం

సంక్షిప్తం2
2/4

సంక్షిప్తం

సంక్షిప్తం3
3/4

సంక్షిప్తం

సంక్షిప్తం4
4/4

సంక్షిప్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement