అమెరికా దురాక్రమణను ఖండిస్తున్నాం
నిజామాబాద్ రూరల్: వెనెజువెలా దేశంపై అమెరికా దురాక్రమణను ఖండిస్తున్నామని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. అమెరికా దాడులకు నిరసనగా ఆదివారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడారు. వెనెజువెలా దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణిని నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అమెరికా వైఖరిని ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, జిల్లా నాయకులు డి.రాజేశ్వర్, కే.గంగాధర్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ నాయకులు లింగం, భాస్కర్, సాయిబాబా, కిరణ్, సాయరెడ్డి, అమూల్య, చరణ్, అశుర్, విజయ్ కుమార్, సజన్, గంగాధర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో...
సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేశ్ బాబు మాట్లాడుతూ వెనెజువెలాపై అమెరికా చేసిన దాడులను ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ిసీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్ , జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు నల్వాల నరసయ్య, అనసూయ, నగర నాయకులు అంజయ్య, శంషుద్దీన్, అబ్దుల్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ: వెనెజువెలాపై అమెరికా దాడి చేయడం దుర్మార్గమని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడారు. నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేశ్, దామోదర్, బాబన్న, సాయారెడ్డి, లింబాద్రి, రమేష్, సర్పంచ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
వెనెజువెలాపై అమెరికా దాడి
దురహంకార చర్య
నిజామాబాద్ రూరల్: వెనెజువెలాపై అమెరికా దాడి దురహంకార చర్య అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పేర్కొన్నారు. ఆదివారం కోటగల్లిలోని ఎన్.ఆర్.భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా తీరును తీవ్రంగా ఖండించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. ఆ దేశంలో ఉన్న చమురు నిల్వలను, ఖనిజ సంపదను దోచుకోవడానికే అమెరికా ఇలాంటి ఘాతుకానికి తెగబడిందన్నారు. సీపీఐ(ఎం.ఎల్) నాయకులు పాల్గొన్నారు.
అమెరికా దురాక్రమణను ఖండిస్తున్నాం
అమెరికా దురాక్రమణను ఖండిస్తున్నాం
అమెరికా దురాక్రమణను ఖండిస్తున్నాం


