అన్నసత్రానికి ముస్లిం యువకుడి విరాళం
సిరికొండ: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవక్షేత్రం లొంక రామలింగేశ్వరస్వామి ఆలయంలో అన్నసత్రంకు సిరికొండకు చెందిన ముస్లిం యువకుడు షేక్ ఉస్మాన్‌పాషా విరాళం అందజేశారు. ఆలయం వద్ద సోమవారం నిర్వహించే అన్నదానానికి ఒక రోజు అయ్యే పూర్తి ఖర్చులను ఉస్మాన్ ఆలయ కమిటీకి చెల్లించాడు. ఉస్మాన్‌ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అవదూత గంగాధర్, సంతోష్, శోభన్, పారుపల్లి రాజ్‌కుమార్, కంచెట్టి లక్ష్మీనారాయణ, తాళ్ల శ్రీనివాస్, కోల భూపతిరాజు, బోయిడి ప్రకాష్, కనగందుల నవీన్, సల్ల భాస్కర్, నగేష్, పెయింట్ శేఖర్, నరేష్, రాజు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


