ఎంపీని కలిసిన మాజీ కార్పొరేటర్
సుభాష్‌నగర్: నగరంలోని 16వ డివిజన్ బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేశ్ ఆదివారం ఎంపీ అర్వింద్ ధర్మపురిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎంపీని శాలువా, పుష్ఫగుచ్చంతో సన్మానించారు. అనంతరం పంచరెడ్డి సురేశ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ జనాకర్షక సంక్షేమ పథకాలు, ఎంపీ అర్వింద్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాను సంక్రాంతి తర్వాత తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరుతానని ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు, ఆర్‌వోబీల నిర్మాణాలతో ఎంపీ అర్వింద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ కుటుంబ పాలనపై ప్రజలు విరక్తి చెందారని అన్నారు. అంతకుముందే అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణను కలిశారు.


