నిజామాబాద్
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
మోర్తాడ్(బాల్కొండ): కడుపులో ఆడ శిశువు జీవం పోసుకుంటుందంటే గర్భంలోనే చిదిమేయాలనే ఆలోచనలో ఉన్న ఎంతో మందికి కనువిప్పు కలిగించే నిర్ణయం తీసుకున్నారు నూతనంగా ఎన్నికై న సర్పంచులు. పుట్టింది ఆడపిల్లనా అనే వారికి కాదు మహాలక్ష్మి అని నిస్సంకోచంగా చెప్పగలిగే ధైర్యాన్నిస్తున్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచు పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగు పెడుతుంటే అండగా మేమున్నాం అంటూ చేయూతనిస్తున్నారు. నగదు, బంగారంతో గౌరవించాలని నిర్ణయించారు. తమకు తోచినంతలో ఎంతో కొంతసాయం అందిస్తూ ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసానిస్తున్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. మా ఊరి మహాలక్ష్మి పథకం పేరిట ఆడపిల్ల పుడితే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి బాండ్ ఇవ్వడం, పెళ్లి చేసుకొని వెళితే కట్నం కింద నగదు, బంగారం అందజేస్తున్నారు.
నిజామాబాద్


