వీసీ, రిజిస్ట్రార్‌లకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

వీసీ, రిజిస్ట్రార్‌లకు సన్మానం

Jan 2 2026 11:50 AM | Updated on Jan 2 2026 11:50 AM

వీసీ,

వీసీ, రిజిస్ట్రార్‌లకు సన్మానం

వీసీ, రిజిస్ట్రార్‌లకు సన్మానం ధర్మారావ్‌పేట్‌లో కుల బహిష్కరణ ఉద్యోగ భద్రత కల్పించాలి ఆరు గొర్రెలు మృత్యువాత

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ యాదగిరి రావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరిలను ప్రైవేట్‌ డిగ్రీ , పీజీ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్‌ ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీసీ, రిజిస్ట్రార్‌లను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు జైపాల్‌ రెడ్డి, మీమ్స్‌ శ్రీనివాసరాజు, మారయ్యగౌడ్‌, నిశిత రాజు, సూర్యప్రకాశ్‌ రావు, శంకర్‌, సంజీవ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, నవీన్‌, విజయ్‌, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదు చేసినా స్పందించలేదని

బాధితుల ఆరోపణ

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావ్‌పేట్‌ గ్రామంలో ఓ కుటుంబాన్ని అదే కులానికి చెందిన సభ్యులు కులం నుంచి బహిష్కరించారు. గ్రామానికి చెందిన సుంకరి సురేశ్‌ కుటుంబాన్ని ఎలాంటి కారణంగా లేకుండా కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు పెద్ద మనుషులు హుకుం జారీ చేసినట్లు బాధితుడు గురువారం సాక్షితో పేర్కొన్నారు. కులంలో జరిగిన శుభ, అశుభ కార్యాలకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మూడు నెలల కింద సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, కేసు కోర్టులో ఉన్నట్లు వివరణ ఇచ్చారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాళాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు గురువారం రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. తరగతుల వారీగా వేతనాలు ఇస్తుండడంతో తాము బాగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. తమకు కనీస కాలపరిమితితో జీతాలు అందజేయాలని కోరారు. తమ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని ఖానాపూర్‌ గ్రామంలో క్రిమిసంహారక మందు చల్లిన మేత తిని ఆరు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్ల మల్లేశ్‌, గొల్ల సుదన్‌కు చెందిన 100 గొర్రెలు గురువారం మేతకు వెళ్లాయి. మేత మేస్తూ ఆకస్మికంగా కొన్ని గొర్రెలు పడిపోవడంతో కాపరులు పశువైద్యాధికారులకు సమాచారం అందించారు. వైద్యులు వచ్చి చూసే సరికి గొల్ల మల్లేశ్‌కు చెందిన ఐదు గొర్రెలు, గొల్ల సుదన్‌కు చెందిన ఒక గొర్రె మృత్యువాతపడ్డాయి. మిగతా జీవాలకు వైద్యులు చికిత్స అందించారు.

వీసీ, రిజిస్ట్రార్‌లకు సన్మానం 1
1/1

వీసీ, రిజిస్ట్రార్‌లకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement