అన్నదాతకు ఆటుపోట్లు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ఆటుపోట్లు

Dec 29 2025 7:32 AM | Updated on Dec 29 2025 7:32 AM

అన్నద

అన్నదాతకు ఆటుపోట్లు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలో ఈ ఏడాదిలో వ్యవసాయ రంగం ఆటుపోట్లు ఎదుర్కొంది. అకా ల వర్షాలు, భారీ వరదలతో రైతులు భారీగా నష్ట పోయారు. దీంతో రావాల్సినదానికంటే పంట దిగుబడులు తక్కువగా వచ్చాయి. ధాన్యం సేకరణ విష యంలో జిల్లా వరుసగా రెండు సీజన్లలో రాష్ట్రంలో నే మొదటి స్థానంలో నిలిచినప్పటికీ దిగుబడి మా త్రం గతంతో పోలిస్తే కొంతమేర తగ్గింది. వానాకాలం సీజన్‌లో పంటలకు తెగుళ్లు, చీడపీడలు సైతం అన్నదాతలను దెబ్బతీశాయి. గడిచిన వానాకాలం సీజన్‌లో 4,36,695 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తే ఎకరానికి 28–30 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఎకరానికి 5–6 క్వింటాళ్ల మేర దిగుబడి తగ్గింది.

● మొక్కజొన్న 52,093 ఎకరాల్లో సాగు చేయగా ఎకరానికి 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావాల్సి ఉన్నప్పటికీ 25–28 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది.

● సోయా పంట విషయానికి వస్తే మాత్రం ఈ ఏ డాది రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. జిల్లాలో 33,603 ఎకరాల్లో సోయా సాగుచేయగా దిగుబడి సగానికి తగ్గిపోయింది. ఎకరానికి 5–6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. చాలామంది రైతులు పెట్టిన పెట్టుబడి కూడా కోల్పోయారు.

● జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా 17,880 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 10,258 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.17.88 కోట్ల పరిహారం విడుదల చేసింది.

● జిల్లాలో ఈ ఏడాది 22,922 ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేశారు. మరో నెల రోజుల్లో పంట చేతికి రానుంది.

● వరుసగా రెండు సీజన్లలో (యాసంగి, వానాకాలం) ధాన్యం సేకరణ విషయంలో జిల్లా రాష్ట్రంలో నే మొదటిస్థానంలో నిలిచింది. గత యాసంగి సీజన్‌లో మొత్తం 7,79,925 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేశారు. సన్నధాన్యానికి బోనస్‌ ఇస్తున్న నేపథ్యంలో సేకరించిన ధాన్యంలో అత్యధికంగా 7,03,103 మెట్రిక్‌ టన్నులు సన్నధాన్యమే వచ్చింది. కేవలం 76,821 మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యం వచ్చింది. యాసంగిలో జిల్లావ్యాప్తంగా 598 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం సేకరించింది. ఇందులో 466 కేంద్రాల ద్వారా సన్నరకం, 132 కేంద్రాల ద్వారా దొడ్డురకం ధాన్యం సేకరించారు.

● తాజాగా ముగిసిన వానాకాలం సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. జిల్లాలో 7,02,009 మెట్రిక్‌ టన్నులు సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకోగా అధికారులు 6,93,288 మెట్రిక్‌ టన్నులు సేకరించారు. జిల్లాలో సేకరించిన ధాన్యంలో 6,00,000 మెట్రిక్‌ టన్నులు సన్నధాన్యం కాగా, మిగిలిన 93,288 మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

గోదావరి, మంజీర పరీవాహకంలో భారీగా పంట నష్టం.. తగ్గిన దిగుబడులు

బోధన్‌ డివిజన్‌లో భారీగా నష్టపోయిన సోయా రైతులు.. సగానికి పడిపోయిన దిగుబడి

యాసంగి, వానాకాలంలో వరుసగా ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే

టాప్‌గా జిల్లా

ఇందూరులో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్‌షా

జిల్లా వ్యవసాయరంగం

2025 రౌండప్‌

పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం

జూన్‌ 29వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిజామాబాద్‌కు వచ్చి పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానికంగా పసుపు పంటకు సంబంధించి ఆర్‌అండ్‌డీ కేంద్రం ఏర్పాటు చేస్తామని అమిత్‌ షా తెలిపారు. అదే విధంగా భారత్‌ కోఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌, భారత్‌ ఆర్గానిక్‌ కోఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో బిలియన్‌ డాలర్ల విలువైన పసుపు ఎగుమతులు చేసేవిధంగా ప్రోత్సహిస్తామన్నారు.

అన్నదాతకు ఆటుపోట్లు1
1/2

అన్నదాతకు ఆటుపోట్లు

అన్నదాతకు ఆటుపోట్లు2
2/2

అన్నదాతకు ఆటుపోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement