దేశానికి బీజేపీ అన్యాయం చేస్తోంది
నిజామాబాద్ రూరల్: దేశానికి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఎగురవేయడంతోపా టు సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా నగేశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్వా తంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని, 1920 నుంచి కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశాభివృద్ధిలో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందన్నారు. సుమారు 49 ఏళ్లు దేశాన్ని పాలించిన గొప్ప పార్టీ తమదని, కాంగ్రెస్ ప్రధానుల దీర్ఘకాలిక ప్ర ణాళికలతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతోందన్నారు. కాంగ్రెస్ ఆవిర్భవించినప్పుడు ఉనికేలేని బీజేపీ ఈ రోజు తమ వల్లే దేశం అభివృద్ధి చెందుతోందని గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్ర తీసుకువచ్చేందుకే కాంగ్రెస్ అవతరించిందన్నారు. దేశ సమగ్రతకు కాంగ్రెస్ పాటుపడిందని, అనిర్వచనీయ సేవలు అందించిందని పేర్కొన్నారు. వ్యక్తుల ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సూజాత, యూత్ కాంగ్రెస్ విపుల్‌గౌడ్, వేణురాజ్, రత్నాకర్, లింగం, రాజానరేందర్‌గౌడ్, శ్రీనివాస్, మీసాల సుధాకర్, వినయ్, మొయిన్, కేశ మహేశ్, ఈసా, ఎజాజ్, సుభాష్‌జాదవ్, ఖు ద్దూస్, బలరాం, శివ, సంగెం సాయిలు, శ్రీశైలం, మాజీ మేయర్ సుజాత, పోల ఉష, చంద్రకళ, విజయలక్ష్మి, మీనా, బాల నర్సయ్య, పురుషోత్తం, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
ఆ పార్టీ తీరును ప్రజలకు వివరిస్తాం
కాంగ్రెస్ ప్రధానుల దీర్ఘకాలిక
ప్రణాళికలతోనే అభివృద్ధి
రాహుల్‌ను ప్రధానిని చేస్తాం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి
నగేశ్‌రెడ్డి
ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
దేశానికి బీజేపీ అన్యాయం చేస్తోంది


