సూపర్ బ్రెయిన్ యోగాతో ఏకాగ్రత
● గుంజిళ్ల మాస్టర్ అందె జీవన్ రావు
డిచ్‌పల్లి(నిజామాబాద్ రూరల్): సూపర్ బ్రెయిన్ యోగా ఆచరణతో విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుందని గుంజిళ్ల మాస్టర్ అందె జీవన్ రావు తెలిపారు. ఈ నెల 26, 27వ తేదీలలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భక్తి వేదాంత ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘వా స్తవికత నిర్మాణంలో సూపర్ బ్రెయిన్ యో గా పాత్ర’ అనే అంశంపై తన పరిశోధనా ప త్రాన్ని సమర్పించి ప్రసంగించారు. సూపర్ బ్రెయిన్ యోగాతో మెదడులోని కుడి, ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని, ఏకాగ్రత గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక
కమ్మర్‌పల్లి: మండలంలోని హాసాకొత్తూ ర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న రిషిత రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం అరుణశ్రీ తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థా యి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన రిషిత రాష్ట్రస్థాయికి ఎంపికై ందన్నారు. నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో రిషిత పాల్గొంటున్నట్లు తెలిపారు.
‘గిన్నిస్ బుక్’లో
కామారెడ్డి కళాకారులు
కామారెడ్డి అర్బన్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 27న 7,209 మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కూచిపూడి కళా వైభవం–2 పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ ప్రదర్శనలో కామారెడ్డి కూచిపూడి కళాక్షేత్రం గురువు, జాతీయ కళాకారుడు వంశీప్రతాప్‌గౌడ్, ప్రతినిధులు కనకతార, హర్షిత సారథ్యంలో 30 మంది పాల్గొన్నారు.
సూపర్ బ్రెయిన్ యోగాతో ఏకాగ్రత


