బాధితుల పక్షపాతి మాధవరావు
● నల్సార్ న్యాయశాస్త్ర యూనివర్సిటీ
వీసీ శ్రీకృష్ణ దేవరావు
నిజామాబాద్ రూరల్: అణచివేతకు గురైన బాధితు ల పక్షాన నిలబడి పోరాడటమే గొర్రెపాటి మాధవరావు జీవనశైలిగా మారిందని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీకృష్ణ దేవరావు అన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు ప్ర థమ వర్ధంతి సభను రాష్ట్ర, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఎల్లమ్మగుట్టలో ని ర్వహించారు. హెచ్‌ఆర్‌ఎఫ్ ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్.జీవన్‌కుమార్ అధ్యక్షత వహించిన సభలో శ్రీకృష్ణదేవరావు ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. హక్కుల సంఘాలతోనే వేలాది మంది బాధితులకు న్యాయం జరిగిందన్నారు. కన్నాభిరామ్, బాలగోపాల్ మాదిరి మాధవరావు చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో చాలా మార్పులు వస్తున్నాయని, న్యాయవాదులు, యువత చట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రధాన కోర్టులలో బాధిత పక్షానికి అనుకూలంగా ఉండాల్సిన తీర్పులు వాటికి భిన్నంగా వస్తున్నాయంటే న్యాయవ్యవస్థలో ప్రమాద గంటికలు మోగుతున్నా యా అని భయపడాల్సి వస్తుందన్నారు. మాధవరావు న్యాయవాద వృత్తిని ఉపాధి వృత్తిలా భావించలేదని, సమాజంలో వ్యత్యాసాలు, అసమానతలు పోవాలని కృషి చేశఆరన్నారు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీ ఆకుల పాపయ్య మా ట్లాడుతూ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చే విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే మాధవరావుకు నిజమైన నివాళి అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయి రెడ్డి, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం గంగులు, గొంట్యాల రమేశ్, మాధవరావు భార్య మీనా సహాని , కూతురు ఆదిత్య మధుమిత్, హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భుజంగరావు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


