కౌంటింగ్ : ఆయా తేదీల్లో పోలింగ్ ముగిసిన రోజునే మధ్యాహ
సుభాష్‌నగర్: గ్రామపంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. సర్పంచ్, వార్డుస్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం గెజిట్ విడుదల చేసింది. రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన వెంటనే ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారులు నామినేషన్ కేంద్రాలను గుర్తించారు. క్లస్టర్ గ్రామాలుగా విభజించి అక్కడే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇప్పటికే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ పూర్త య్యేవరకు రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలను (ఓటింగ్) నిర్వహించనున్నారు.
మొదటి విడతలో బోధన్ డివిజన్‌లోని 184 జీపీలు, 1,642 వార్డుస్థానాలు, 1,653 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రెండో విడత (14న) నిజామాబాద్ డివిజన్‌లో 196 జీపీలు, 1,760 వార్డుస్థానాలు, 1,760 పోలింగ్ కేంద్రాలున్నాయి. మూడో విడత (17న) ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 165 జీపీలు, 1,620 వార్డుస్థానాలు, 1,640 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
మూడో విడత
కౌంటింగ్ : ఆయా తేదీల్లో పోలింగ్ ముగిసిన రోజునే మధ్యాహ


