సీపీఐ నేత నర్సింహారెడ్డి మృతి
● గరీబోళ్ల వకీల్‌గా పేరు
● నేడు కామారెడ్డిలో అంత్యక్రియలు
కామారెడ్డి టౌన్: సీపీఐ నేత, సీనియర్ న్యాయ వాది వీఎల్.నర్సింహా రెడ్డి(70) గుండెపోటుతో మృతి చెందారు. కామా రెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న ఆయనను రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతిచెందారు. ఆయనకు కుమారుడు, కూతురు ఉన్నారు. నర్సింహారెడ్డి అంత్యక్రియలను జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించనున్నారు.
40 ఏళ్లుగా..
నర్సింహారెడ్డి నిజామాబాద్ జిల్లా సిరికొండలో జన్మించగా, ఆయన కుటుంబం 40 ఏళ్ల క్రితమే కామారెడ్డిలో స్థిరపడింది. లా చదివిన ఆయన.. అతి తక్కువ ఫీజు తీసుకుంటూ పేదోళ్ల వకీల్‌గా పేరుగాంచారు. ఉమ్మడి జిల్లాతోపా టు, కామారెడ్డి జిల్లా సీపీఐ కార్యదర్శిగా పనిచేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడిగా, పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఆర్మూర్‌లో రంగాచారి కాలనీ, కామారెడ్డిలో ఫణిహా రం రంగాచారి కాలనీ పేరుతో హమాలీలకు, బతుకమ్మ కుంటలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల ను ప్రజా ఉద్యమాల ద్వారా సాధించారు.


