సృజనాత్మకతకు పదును పెట్టాలి
బోధన్ టౌన్: విద్యార్థులు తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి నూతన ఆలోచనలతో ప్రాజెక్టులను ఆవిష్కరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సూచించారు. మారుతున్న పరిస్థితులను బట్టి సమాజ అవసరాలకు అనుగుణంగా ఆలోచన విధానాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. బోధన్ పట్టణంలోని విజయ మేరీ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్, ఇన్‌స్పైర్ మంగళవారం ముగిసింది. జిల్లా విద్యాశాఖ అధికారి ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్ధులు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ఆలోచనలకు పదును పెట్టి రూపొందించిన ప్రదర్శనలు అతిథులను ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింపజేసేలా ఉన్నాయన్నారు. విద్యార్థుల ఆలోచనలు భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగడానికి దోహద పడుతాయన్నారు. సైన్స్‌ఫేర్‌లో భాగస్వాములైన వి ద్యార్ధులకు మెమెంటోలు, ప్రశంసాప్రతాలను అందజేశారు. జిల్లా సైన్స్ కన్వీనర్ గంగాకిషన్, ఎంఈవో నాగయ్య, డీసీఈబీ కార్యదర్శి సీతయ్య, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడాలి కిశోర్‌కుమార్, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ పాల్గొన్నారు.
520 ప్రదర్శనలు..
సైన్స్‌ఫేర్‌లో విద్యార్థులు 520 ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తమ నూతన ఆలోచనలతో విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు సామాజిక అంశాలను సూచించాయని అతిథులు పేర్కొన్నా రు. పర్యావరణహితం, ట్రాఫిక్ నిబంధనలు , నీటి సంరక్షణ తదితర సామాజిక అంశాలపై విద్యార్థు లు రూపొందించిన ప్రదర్శనలు అతిథులను, విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు వ్యాసరచన, చిత్ర లేఖన పోటీలు నిర్వహించారు. బోధన్ పట్టణంలోని ఇందూర్ బీఈడీ కళాశాలకు చెందిన విద్యార్ధులు సత్తా చాటారు. విద్యార్ధులు ప్రవళిక, వెన్నెల ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అనే అంశం ఏర్పాటు చేసిన ప్రదర్శన రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. ఇందూర్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ అప్పలనాయుడు విద్యార్థులను అభినందించారు.
సమాజ అవసరాలకు అనుగుణంగా ఆలోచన విధానాలు ఉండాలి
ఆలోచనలే విద్యార్థులను భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదిగేలా చేస్తాయి
సైన్స్‌ఫేర్ ప్రదర్శనలు ఆలోచింపజేశాయి
జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్


