
డబుల్ ఇళ్లపై కదలిక
న్యూస్‌రీల్
నిజామాబాద్
వీడీసీ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ సీజ్
జీరో విద్యుత్ ప్రమాదాలే..
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) మధుసూదన్ సూచించారు.
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లో u
నిజామాబాద్ అర్బన్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ ఇళ్ల కోసం అర్హులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో గెజిటెడ్ అధికారుల బృందాలతో విచారణ చేపడుతున్నారు. అధికారుల బృందాలు ఎంపిక చేసిన వారికి ఎల్–2(ఇల్లు, జాగాలేనివారు) కేటగిరి కింద ఇళ్లు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వ హ యాంలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిచిపోయింది. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఇటీవలే జిల్లా కేంద్రంలోని నాగారంలో ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ అధికారులు పరిశీలించారు.
వారికే ముందు..
డబుల్ ఇళ్ల పంపిణీ కోసం గత ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులను పలు ఆరోపణల నేపథ్యంలో పక్కన పెట్టేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన లో దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఇల్లు, సొంత జాగా లేని వారిని అర్హులుగా ఎంపిక చేసే అ వకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 9486 డబుల్ ఇళ్లు మంజూరు కాగా, 5695 పంపిణీ చేశారు. 1662 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 2129 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో 396 ఇళ్ల పనులు పూర్తయి రెండేళ్లవుతోంది.
బాన్సువాడ ముందంజ
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో బాన్సువాడ నియోజకవర్గం(నిజామాబాద్ జిల్లా పరిధిలోని మండలాలు) ముందంజలో ఉంది. నియోజకవర్గానికి 4807 ఇళ్లు మంజూరు కాగా 4018 ఇళ్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం రెండు ఇళ్ల నిర్మాణాలు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉండగా, మరో 787 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో ఇంత వరకు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదు. ఆర్మూర్ నియోజక వర్గంలో 92 , నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో 98 , బాల్కొండ నియోజక వర్గంలో 925, బోధన్ నియోజకవర్గంలో 562 ఇళ్లు ఇప్పటి వరకు పంపిణీ చేశారు. ప్రస్తుతం 1662 ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసే అవకాశం ఉంది.
జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి అయిన డబుల్‌బెడ్‌రూమ్‌లు
మరమ్మతులకు రూ.3కోట్లు
జిల్లాలోని వర్నితోపాటు పలు ప్రాంతాల్లో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయనప్పటికీ అర్హులు బలవంతంగా వాటిలో ఉంటున్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు సంవత్సరాల తరబడి అలాగే ఉండడంతో కిటికీలు, తలుపులు, కులాయిలు, పైపులను దుండగులు ఎత్తుకెళ్లారు. పలు చోట్ల ధ్వంసమయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. వాటి మరమ్మతులకు రూ.3 కోట్లు మంజూరు చేశారు. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తిచేసి ఇళ్లను బాగుచేయాలని అధికారులు ఆదేశించారు.
కమిటీ రద్దుకు సుర్భిర్యాల్
గ్రామస్తుల నిర్ణయం
పంపిణీ చేసేందుకు అధికారుల నిర్ణయం
అర్హుల ఎంపికపై కొనసాగుతున్న
క్షేత్రస్థాయి విచారణ
ప్రజాపాలన దరఖాస్తులే ప్రామాణికం?
విచారణ కొనసాగుతోంది
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అర్హుల ఎంపికకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. గెజిటెడ్ అధికారుల బృందాలను నియమించడం జరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు. అనంతరం అర్హులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయిస్తాం. – నివర్తి, హౌసింగ్ ఏఈ

డబుల్ ఇళ్లపై కదలిక

డబుల్ ఇళ్లపై కదలిక

డబుల్ ఇళ్లపై కదలిక