
కొనసాగుతున్న నీటి విడుదల
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో వస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి నిజాంసాగర్‌లోకి 80 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో 16 గేట్ల ద్వారా 88 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,403. 67 అడుగుల (15.902 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న జలాలు