
చివరి దశలో ఇందిరమ్మ ఇళ్ల పనులు
బోధన్: జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు తొ లి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులతో కలిసి పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్‌లో 15 ఇళ్లు పూర్తయ్యా యని, వాటిని వారం రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్, ఠాణాకలాన్ గ్రామాలను అడిషనల్ కలె క్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, వివిధ శాఖల అధికారులతో కలిస కలెక్టర్ మంగళవారం సందర్శించారు. జైతాపూర్‌లో 74 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, పూర్తయిన 15 ఇళ్లకు సంబంధించి చిన్నచిన్న పనులను వెంటనే పూర్తి చేయించాలని అధికారుల కు సూచించారు. బిల్లుల చెల్లింపులపై ఆరా తీయ గా, చివరి విడతకు సంబంధించి రూ.లక్ష బిల్లు రావాల్సి ఉందని లబ్ధిదారులు తెలిపారు. వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అ ధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇళ్లకు విద్యుత్ క నెక్షన్, మిషన్ భగీరథ నీటి సరఫరా సౌకర్యాలు క ల్పించాలని విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఎవరైనా ఇళ్ల నిర్మాణానికి ముందుకురాకపోతే వారి స్థానంలో అర్హులను గుర్తించాలని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఆడంబారాలకు పోయి అప్పు ఊబిలో కూ రుకుపోవద్దన్నారు. అనంతరం రూర్భన్ పథకం కింద కొత్తగా నిర్మించిన పల్లె దవాఖానను సందర్శించారు. నూతన భవనంలో విద్యుత్ సౌక ర్యం లేదని గుర్తించి, వెంటనే విద్యుత్ సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎరువుల కొరత లేదు
జిల్లాలో యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని, రైతుల అవసరాల మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అన్నారు. ఠాణాకలాన్ లోని సొసైటీ గోదామును సందర్శించి స్టాక్‌ను ప రిశీలించారు. ఖరీఫ్ సీజన్ తరహాలోనే వచ్చే యా సంగి సీజన్‌లో సైతం కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలన్నారు. పట్టాపా స్ పుస్తకాలు లేని రైతులు పంటలు సాగు చేస్తే వారికి కూడా ఎరువులు ఇవ్వాలని ఆదేశించారు. ఆయనవెంట జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ పవన్‌కుమార్, మండల అధికారులు ఉన్నారు.
వివిధ దశల్లో తొలి విడత
మంజూరైన ఇళ్లు
పూర్తయిన వాటిని త్వరలో ప్రారంభిస్తాం
నిర్మాణానికి ముందుకు రాని లబ్ధిదారుల స్థానంలో కొత్తవారి ఎంపిక
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి