
జిల్లా కేంద్రంలో దొంగల హల్‌చల్
ఖలీల్‌వాడి: మారుతి వ్యాన్‌లో వచ్చిన దుండగులు ముసుగులు ధరించి.. గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా ముసుగులు ధరించారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో వ్యాన్‌లో పరారయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌కాలనీ చౌరస్తాలో మంగళవా రం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ అయిన మారుతి వ్యాన్‌లో వచ్చిన దండగులు ముసుగులు ధరించి ఏటీఎంలోకి ప్రవేశించారు. తమ వెంట తీ సుకొచ్చిన గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేశా రు. నగదు తీసేందుకు యత్నిస్తున్న సమయంలోనే పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడంతో వ్యాన్‌లో పరారయ్యారు. బాసరవైపు పారిపోతుండగా అప్రమత్తమైన పెట్రోలింగ్ సిబ్బంది దుండగుల వాహనాన్ని వెంబడిస్తూనే అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమా చారం అందించారు. తప్పించుకునే మార్గం లేకపోవడంతో నవీపేట మండలం పాల్ద వద్ద మారుతి వ్యాన్‌ను వదిలేసి పారిపోయారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ముంబై మెయిన్ బ్రాంచ్‌కు మెస్సేజ్
ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నిస్తున్న సమ యంలో ముంబైలోని మెయిన్ బ్రాంచ్‌కు మెస్సేజ్ వెళ్లడంతో అక్కడి సిబ్బంది నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. వెంటనే మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ వాహనం ఏటీఎం వద్దకు చేరుకోవడంతో దుండగు లు పరారయ్యారు. ఏటీఎం నుంచి నగదు పోలేదని ఎస్సై హరిబాబు తెలిపారు.
ఘటనా స్థలం పరిశీలన
ఘటనాస్థలాన్ని సీపీ పోతరాజు సాయిచైతన్య పరిశీలించారు. మూడవటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంను సీపీ పోతరాజు సాయిచైతన్య పరిశీలించారు. ఎస్సై హరిబాబు, సీఐ శ్రీనివాస్ రాజుకు పలు సూచనలు చేశారు. కేసు విచారణ చేయాలని క్లూస్ టీం, సీసీఎస్ టీం అధికారులను ఆదేశించారు.
ఏటీఎం చోరీకి యత్నం
ముసుగులు ధరించి
మారుతి వ్యాన్‌లో వచ్చిన దుండగులు
వెంట గ్యాస్ కట్టర్..
పెట్రోలింగ్ వ్యాన్ రావడంతో పరార్
పాల్దా వద్ద మారుతి వ్యాన్‌ను
వదిలేసిన చోరులు

జిల్లా కేంద్రంలో దొంగల హల్‌చల్