
అలీసాగర్ రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత
బోధన్: ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులో ఉన్న అలీసాగర్ రిజర్వాయర్ కు భారీ వరద రావడంతో రెండు గేట్లను ఎత్తా రు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామ ర్థ్యం 1299.6 ఫీట్లుకాగా సోమవారం ఉదయం వరకు 1298.6 ఫీట్ల మేర నీరు చేరింది. దీంతో రెండు వరద గేట్లు ఎత్తి 1000 క్యూసెక్‌ల నీటిని దిగువ ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు డి–50 కాలువలోకి వదిలారు. నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రిజర్వాయర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది.