
అతి తక్కువ ఫీజుతో వైద్యం అందిస్తాం
నిజామాబాద్‌నాగారం: అనుభవజ్ఞులు, వైద్య నిపుణుల బృందంతో ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సెస్ – రీసెర్చ్(ఐఎంఎస్‌ఆర్) ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించిన తాము.. క్రిస్టియన్ మెడికల్ కళాశాల, ఆస్పత్రిని ప్రారంభించేందుకు సీఎస్‌ఐతో ఒప్పందం చేసుకున్నామని చైర్మన్ షణ్ముఖ మహాలింగం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఎంఎస్‌ఆర్ ఆధ్వర్యంలో డిచ్‌పల్లిలోని సీఎంసీని పున:ప్రారంభించేందుకు వివిధ దశల్లో రూ.200 కోట్లు పెట్టుబ డి పెట్టేందుకు 2024లో ముందుకు వచ్చామన్నారు. 500 పడకల సీఎంసీ ఆస్పత్రిని మే 25వ తేదీన రాష్ట్ర అధికారుల ఆమోదంతో ప్రజల కోసం తిరిగి ప్రారంభించామని తెలిపారు. డాక్టర్ అజ్జ శ్రీ నివాస్ అనే వ్యక్తి తనను ఇండియన్ మెడికల్ అసో సియేషన్ నిజామాబాద్ అధ్యక్షుడిగా పరిచయం చేసుకుని వచ్చాడని, తనకు 200 మంది వైద్యుల నెట్ వర్క్ ఉందని చెప్పి 30 మందిని నియమించాడన్నారు. డాక్టర్లు అజ్జ శ్రీనివాస్, మంత్రి సుమంత్, ఎల్.పాండు, సుమన్‌కుమార్, సుర్దానీ ఇష్టరాజ్యాంగా వ్యవహారించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య పరికరాల కోసం ఐఎంఎస్‌ఆర్ రూ.92 లక్షలు (చె క్కు)ఇవ్వగా.. కొంత పాత పరికరాలను కొనుగోలు చేశారని తెలిపారు. ఇంకా రూ.72లక్షల విలువైన సామగ్రి అందివ్వలేదని తెలిపారు. ఆ తరువాత అజ్జ శ్రీనివాస్‌ను జూన్ 10వ తేదీన తొలగించామని, హైపవర్ కమిటీ చివరకు అజ్జ శ్రీనివాస్ సర్టిఫికెట్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు. త్వరలోనే ప్రభుత్వ అనుమతులతో సీఎంసీని ప్రారంభించి ప్రజలకు అతి తక్కువ ఫీజులతో మె రుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు.
సీఎంసీని ప్రారంభించేందుకు
సీఎస్‌ఐతో ఒప్పందం
వివిధ దశల్లో రూ.200 కోట్ల పెట్టుబడి
అజ్జ శ్రీనివాస్‌ను డైరెక్టర్ పదవి
నుంచి తొలగించాం
సీఎంసీ చైర్మన్ షణ్ముఖ మహాలింగం