సుభాష్‌నగర్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్త లు పిలుపునిచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని సో మ వారం ఘనంగా నిర్వహించారు. వినాయక్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం న గరంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో వక్తలు మాట్లాడారు. రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సా ధారణ వ్యక్తి వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేయడం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధి కారి నర్సయ్య, బీసీ సంఘాల నాయకులు నరాల సుధాకర్, రాజ నరేందర్ గౌడ్, ఆదె ప్రవీణ్, మారయ్య గౌడ్, జయసింహాగౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు, గీత వృత్తిదారులు పాల్గొన్నారు.
ప్రజలను అప్రమత్తం చేయండి
రెంజల్(బోధన్): గోదావరి, మంజీర పరీవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీపీ సాయి చైతన్య సూచించారు. మండలంలోని కందకుర్తి పుష్కరక్షేత్రంతోపాటు అంతర్రాష్ట్ర వంతెన పైనుంచి సోమ వారం గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. రానున్న రెండు, మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు ప్రకటించారని గుర్తుచేశారు. నదుల వైపు వెళ్లకుండా గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 59700 నంబర్లకు కాల్ చేసే లా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయన వెంట ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బా బు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సిద్ధి రామేశ్వర్ ఉన్నారు.
ఈ నెల 20నుంచి డిచ్‌పల్లి రైల్వే గేటు మూసివేత
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో మండల కేంద్రం నుంచి ఘన్‌పూర్, ఖిల్లా డిచ్‌పల్లి, దూస్‌గాం, ముల్లంగి(ఐ), గ్రామాలకు వెళ్లే దారిలో ఉన్న రైల్వే గేటు (నెంబర్ 196టీ)ను నాలుగు రోజులపాటు మూసివేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20న అర్ధరాత్రి 12 గంటల నుంచి 24వ తేదీ రాత్రి 11 గంటల వరకు గేటు మూసి వేసి ఉంటుందని పేర్కొన్నారు. వాహనదారులు డిచ్‌పల్లి స్టేషన్, నాగ్‌పూర్ గేట్, 44వ నంబర్ జాతీయ రహదారిపై 7వ బెటాలియన్ లక్ష్మీవేంకటేశ్వర ఆలయం మీదుగా ఘన్‌పూర్ గ్రామానికి చేరుకోవాలని సూచించారు. అలాగే ఘన్‌పూర్ నుంచి బొమ్మల గుండు హనుమాన్ మందిరం, 44వ నంబర్ జాతీయ రహదారి, పోలీస్ స్టేషన్ మీదుగా డిచ్‌పల్లి స్టేషన్‌కు చేరుకోవాలని పేర్కొన్నారు.
ఆర్మూర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణనిచ్చేందుకు రెండు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మూర్ మండల కేంద్రంతోపాటు బాన్సువాడ పరిధిలోని వర్నిలో రూ.45 కోట్ల వ్య యంతో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పరిపాలన అనుమతులతో కూడిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల విభాగంతోపా టు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్) సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో 46 ఏటీసీల ఏర్పాటుకు ఉత్తర్వులు అయ్యాయి. అందులో భా గంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రెండు కేంద్రాలు మంజూరు కావడంపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ప్రత్యేక చొరవతో ఈ ఏటీసీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంపై ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సర్వాయి పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి