
రెండు పంటలకూ భరోసా
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయం ఆయకట్టు రైతుల్లో భరోసా నింపింది. మొన్నటి వరకు ఖరీఫ్ పంటలకు మాత్రమే నీరందుతుందని అనుకున్న రైతులకు మూడు రోజుల వ్యవధిలో వచ్చిన వరద యాసంగి సీజన్‌పై నమ్మకం పెంచింది. జూన్, జూలై నెలల్లో అంతంతగా వరద రావడంతో ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు నీటి విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటల కోసం నాలుగు తడులు అందించేందుకు ప్రాజెక్ట్ అధికారులు నీటి విడుదల ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రాజెక్ట్‌లోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. గత మూడు రోజుల నుంచి వరద ఉధృతి పెరడగంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదులుతున్నారు. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి అక్టోబర్ 28 వరకు వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో యాసంగి సీజన్ ప్రారంభమయ్యే వరకు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉండే అవకాశం ఉంది. రెండో పంటకు సైతం భరోసా కలగడంపై ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
75.73 టీఎంసీల వరద
ప్రస్తుత సంవత్సరం జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌లోకి 75.73 టీఎంసీల వరద నీరు చేరింది. జూన్‌లో 4.48 టీఎంసీలు, జూలైలో 24.49 టీఎంసీలు, ఆగస్టులో (ఇప్ప టి వరకు) 46.76 టీఎంసీల వరద వచ్చింది. ఇప్పటి వరకు ఆవిరి రూపంతోపాటు కాలువ ల ద్వారా, తాగునీటి అవసరాలకు 10.44 టీఎంసీల నీటి విడుదల చేపట్టారు.
నిండుకుండలా ఎస్సారెస్పీ
ఆయకట్టు రైతుల హర్షం