
అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి
● డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్
● డిచ్‌పల్లి సీహెచ్‌సీ తనిఖీ
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): సీజనల్ వ్యాధుల నివారణ కోసం అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ సిబ్బందిని ఆదేశించారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)ని శనివారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్‌తో కలిసి సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్యసేవలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంపొందేలా కృషి చేయాలని వైద్యులకు వారు సూచించారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజన, జిల్లా మలేరియా అధికారి తుకారం రాథోడ్, ఎన్‌హెచ్‌ఎం రాజు, జిల్లా సర్వేలైన్ అధికారి నాగరాజు, సీహెచ్‌సీ వైద్యాధికారులు శివశంకర్, సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయిలో..
ఇందల్వాయి: ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య విదాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమయానుసారం ప్రజలకు అందుబాటులో ఉండాలని, మందులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రపర్చాలని సూచించారు. వైద్య సిబ్బంది వెంకటేష్, క్రిస్టినా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి