
ఈనెల 19న ఏచూరి సంస్మరణ సభ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో ఈనెల 19న పట్టణ మున్నూరుకాపు సంఘం కల్యాణ మండపంలో సీపీఎం పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేకర్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, శాఖ కార్యదర్శులు, సభ్యులు, శ్రేణులు, రైతులు, కార్మికులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకట్ గౌడ్, మొతీరాం నాయక్, కొత్త నర్సింలు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణంలో నవంబర్ 16న మిస్టర్ కామారెడ్డి బాడీ బిల్డర్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిమ్ ప్రతినిధులు నవీన్, యాసిన్‌లు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి జిమ్ యజమానుల ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా కామారెడ్డిలో జిల్లా స్థాయి బాడీ బిల్డర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో ఏడు కేటగిరీలు ఉంటాయని వివరించారు. పోటీలో ప్రథమ, ద్వితియ, తృతియ బహుమతులు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు 9848278436 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. జిల్లాలోని బాడీ బిల్డర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో శివ, లిఖిత్‌గౌడ్, మహిపాల్, రథిఫ్‌రెడ్డి, తేజ, ఎజాజ్, దేవా తదితరులున్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట గ్రామ పంచాయతీ సమీపంలో దాత అయిన సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి శనివారం తన సొంత నిధులతో షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు గ్రామాల్లో ఇప్పటి వరకు తన వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈనెల 19న ఏచూరి సంస్మరణ సభ