జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం | - | Sakshi
Sakshi News home page

జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం

Aug 15 2025 7:22 AM | Updated on Aug 15 2025 7:22 AM

జాతి

జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం

నేడు స్వాతంత్య్ర దినోత్సవం

వీధివీధిన రెపరెపలాడనున్న త్రివర్ణ పతాకం

నిబంధనలు..

● జెండా దీర్ఘ చతురస్రాకారంలో ఉండి, పొడవు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండాలి.

● సమ నిష్పత్తిలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు కలిగిఉండాలి. మధ్యలో నీలి రంగులో 24 మొనలు కలిగిన అశోక ధర్మ చక్రం రెండు వైపులా కనిపించేలా ఉండాలి.

● పతాకాన్ని గౌరవప్రదమైన ప్రదేశాల్లో ఎగుర వేయాలి.

● జెండాలోని కాషాయ రంగు పైకి వచ్చేలా కట్టాలి.

● జాతీయ పతాకం కంటే ఎత్తుగా మరే పతాకం ఎగుర వేయకూడదు.

● కుడి వైపున ఇతర జెండాలను పెట్ట కూడదు. జెండాను అలంకరణగా వాడరాదు.

● పతాకాన్ని నేలకు తగిలేలా ఉంచరాదు.

● ఎగర వేసేటప్పుడు జెండా వైపే చూస్తూ, నిలబడి వందనం చేయాలి. అనంతరం జాతీయ గీతాలాపన చేయాలి.

● సూర్యోదయం కంటే ముందు జెండాను ఎగురవేయకూడదు.

● సూర్యాస్తమయం సమయంలోనే కిందికి దించాలి.

● ప్రభుత్వ భవనాలపై త్రివర్ణ పతాకం ఎల్లప్పుడు ఎగురవచ్చు.

● దేశ ప్రముఖులు చనిపోతే సంతాప సూచకంగా పతాకాన్ని అవతనం చేయాలి.

● చినిగిన, నలిగిన పతాకాన్ని ఎగురవేయరాదు.

ఆర్మూర్‌: ఎటు చూసినా రాజకీయ పార్టీల జెండాలే దర్శనం ఇవ్వడంతో 145 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న మువ్వన్నెల జెండాకు గుర్తింపు కరువవుతోంది. ఇలాంటి తరుణంలో మన జాతీయ జెండా ప్రాముఖ్యతను, నియమాలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ప్రాముఖ్యత, నియమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

జాతీయ జెండా రూపకల్పన ఇలా..

1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో బందరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య ఒక జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీజీకి చూపించారు. రెండు గడులు పచ్చగా ఒక గడి ఎరుపుగా ఉండేది. గాంధీజీ ఆ పతాకానికి కొన్ని మార్పులు సూచించారు. దాని ప్రకారం తెలుపు, పచ్చ, ఎరుపు రంగుల మధ్య చరఖా వచ్చి చేరింది. నేటి మన జాతీయ పతాకానికి మాతృక ఇది. 1931లో కరాచిలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకత్వం జాతీయ పతాకం రూపొందించడం కోసం ఒక సబ్‌ కమిటీని నియమించింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఎరుపు, తెలుపు, ఆకుప్చ రంగులున్న పతాకాన్ని రూపొందించారు. తెలుపు రంగులో నీలి రంగు చరఖాను ఏర్పరిచారు. ఈ పతాకాన్ని కాంగ్రెస్‌ కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత జాతీయ జెండాలో రాట్నానికి బదులుగా అశోక ధర్మ చక్రాన్ని చేర్చమని అంబేడ్కర్‌ ప్రతిపాదించగా, సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ సమర్థించారు. దీంతో జాతీయ పతాకం మధ్యలో నీలి రంగులో 24 మొనలు కలిగిన అశోక ధర్మ చక్రాన్ని ముద్రించారు. ఈ జాతీయ పతాకాన్ని భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న ఆమోదించింది.

జిల్లాకు భారీ వర్ష సూచన

జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం 1
1/3

జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం

జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం 2
2/3

జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం

జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం 3
3/3

జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement