
పెళ్లి వ్యాన్ బోల్తా: 15 మందికి గాయాలు
డిచ్‌పల్లి: మండలంలోని మిట్టపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం పెళ్లి వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ మండలం అర్సపల్లి గ్రామానికి చెందిన యువతితో ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సట్ల అనిల్‌కు గురువారం పెళ్లి జరిగింది. మల్లాపూర్‌కు వచ్చిన వధువు తరపు బంధువులు సుమారు 50 మంది సాయంత్రం వ్యాన్‌లో అర్సపల్లికి బయలుదేరారు. మిట్టాపల్లి గ్రామశివారులోని మహాలక్ష్మీ ఆలయం మలుపు వద్ద వారి వ్యాన్ ప్రమాదవశాత్తు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, వారిలో బాగిర్తి చంద్రయ్య, రాజయ్యలకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలియగానే మల్లాపూర్ మిట్టపల్లి గ్రామానికి చెందిన పలువురు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు.