
నిజామాబాద్
న్యూస్‌రీల్
‘సాగర్’కు 35,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నిజాంసాగర్: మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం పెరిగింది. పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతుండడంతో శనివారం 10 వేల క్యూసెక్కుల నీరు నిజాంసాగర్‌లోకి వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఘనపురం ఆనకట్ట, హల్దీవాగు, సింగూరు ప్రాజెక్టు ద్వారా 25,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,398.08 అడుగుల (9.407 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
సింగూర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టులోని శనివారం 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా వస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు 5 గేట్ల ఎత్తివేసి 45 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు నిజాంసాగర్ ప్రాజెక్టును చేరనుంది.
వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ పెద్దవాగు చెక్‌డ్యాం వద్ద వర్షపు నీరు
సాగు, తాగునీటికి ఢోకా లేదిక
నిండుతున్న ప్రాజెక్టులు, చెరువులు
పారుతున్న అలుగులు, వాగులు
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి