
విపత్కర పరిస్థితుల్లోనూ వైద్య సేవలందించాలి
నిజామాబాద్‌నాగారం: భారీ వర్షాల దృష్ట్యా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ వార్డులో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించా రు. ఫార్మసీ, టీహబ్, ఫీవర్ వార్డు, బ్లడ్ బ్యాంక్ త దితర విభాగాలను సందర్శించి వివరా లు తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్ లో వైద్యులు, అధికారులతో కలిసి మీడియాతో మా ట్లాడారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు సీహెచ్‌సీ, పీహెచ్‌సీలతోపాటు జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశామన్నారు.
సమన్వయంతో ముందుకు సాగాలి
డెంగీ కేసులు, ఇతర విషజ్వరాలు ఎక్కడైనా ప్రబలితే అవసరమైన ఇతర శాఖల సహాయం తీసుకొని రోగులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని డీఎంఈ నరేంద్రకుమార్ అన్నారు. ఆయన వెంట తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, మెడికల్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ నాగమోహన్, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ రాములు, డాక్టర్ సరస్వతీ, ఎన్‌హెచ్‌ఎం రాజు, సర్వేలైన్ అధికారి నాగరాజు, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. కాగా, తనిఖీల సమయంలో ఔషధాల స్టోర్ రూమ్‌కు తాళం ఉండడంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు.
ఒక్కసారి 100 మంది వచ్చినా..
భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా 50 నుంచి 100 మంది రోగులు వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని మూడు నెలలకు సరిపడా మందులతోపాటు బెడ్స్, వైద్య సిబ్బంది, టెక్నీషియన్స్, ల్యాబుల్లో కెమికల్స్ ఉంచుకోవాలని సూచించారు. సీ జనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలని పేర్కొన్నారు. వర్షాలతో రవాణా సమస్య ఏర్పడే అవకాశం ఉందని, రెండు వారాలకు సరిపడా నిత్యావసర సరుకులు స్టాక్ పెట్టుకోవాలన్నారు.
భారీ వర్షాల దృష్ట్యా వైద్యులు,
సిబ్బంది అందుబాటులో ఉండాలి
డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్