
ఏడు కొండలను కాపాడుకోవాలి
మాక్లూర్: వేదకాలం నాటి శ్రీవారి ఏడు కొండలను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందని మధుర భారతి బిరుదాంకితులు, ఉభయ వేదాంత డాక్టర్ వోలేటి రవికుమారాచార్య స్వామి అన్నారు. మండలంలోని గుత్ప చౌరస్తా వద్దగల అపురూప వేంకటేశ్వర ఆలయంలో శనివారం ఆయన వేంకటేశ్వరస్వామి విశేష ప్రవచనాలు వినిపించారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఆలయా లు కేంద్రస్థానాలని తెలిపారు. ఇతిహాస పు రాణాలలో చెప్పబడిన ధర్మాలను తెలుసు కుని ఆరోగ్యకరమైన సామాజిక కుటుంబ జీ వనం సాగించాలన్నారు. ధర్మమార్గంలో న డుస్తూ న్యాయంగా సమాజ అభివృద్ధికి పా టుపడాలన్నారు. అనంతరం శ్రీకృష్ట జన్మాష్టమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ సేనాపతి వెంక ట కుమారస్వామి, ఆలయ చైర్‌పర్సన్ అమృతలత, సురేందర్‌రెడ్డి భక్తులు పాల్గొన్నారు.
యోగాతో ఆరోగ్యం
● అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్‌నాగారం: ప్రతి వ్యక్తి రోజు 40 నిమిషాల పాటు యోగా చేయడంతో మంచి ఆరోగ్యం పొందవచ్చని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని నగరంలోని దయానంద యోగా కేంద్రంలో ఎమ్మె ల్యే ప్రత్యేకంగా అభినందించి సన్మానించా రు. ప్రస్తుతం యోగా అనేది ప్రతి ఒకరిలో భాగమైందని అన్నారు. అనంతరం యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన బి.పద్మ, కృష్ణవేణి, ఆర్.ప్రియాంక, డి.ప్రియాంక, నిత్య, రిత్విక, అబ్బయ్యను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు యోగ రా మచందర్, అధ్యక్షుడు యోగారత్న ప్రభాక ర్, ప్రధాన కార్యదర్శి టి.బాల శేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి జి.సంగీత, కోశాధికారి ఎం. భూమాగౌడ్, సంయుక్త కార్యదర్శి ఎం. రఘువీర్, శ్రీనివాస్, కార్పొరేటర్ శ్రీధర్, ప్రభాకర్, యోగా శిక్షకులు, సాధకులు పాల్గొన్నారు.
‘మహాలక్ష్మి’తో ఆర్టీసీకి ఆదాయం
బాన్సువాడ : మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతోందని ప్ర భుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం బా న్సువాడ బస్‌డిపోకు వచ్చిన రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సులను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నిజామాబాద్ నుంచి జహీరాబాద్‌కు(వయా బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్), మరొకటి బాన్సువాడ నుంచి నారాయణ్‌ఖేడ్ (వయా పిట్లం, నిజాంపేట్) నడుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం సరితాదేవి, బీర్కూర్ ఏఎంసీ చైర్మన్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

ఏడు కొండలను కాపాడుకోవాలి