
నిష్పక్షపాతంగా విచారణ జరపాలి
పెర్కిట్(ఆర్మూర్): కేజీబీవీ పాఠశాల విద్యార్థిని కా వేరి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వి యా సూచించారు. పెర్కిట్ కేజీబీవీలో ఇంటర్ వి ద్యార్థిని కావేరి మృతిపై సబ్ కలెక్టర్ గురువారం పా ఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. పాఠశాల ప్రత్యేక అధికారిణి గంగమణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తోటి విద్యార్థినులతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. విద్యార్థిని అర్ధరాత్రి వాష్‌రూంకు వెళ్లగా కోతులు వెంబడించడంతో భయప డి, పరిగెత్తుతూ ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి పడిందని పాఠశాల అధికారిణి సబ్‌కలెక్టర్‌కు తెలిపారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున పా రదర్శకంగా విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కోతుల బెడద నివారణకు పాఠశాల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చే యించాలని అధికారులను ఆదేశించారు. మున్సిప ల్ కమిషనర్ తహసీల్దార్ పాల్గొన్నారు.