
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో
సొసైటీ చైర్మన్ మృతి
మోర్తాడ్(బాల్కొండ): మండలంలోని దొన్కల్ శివారులోగల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శెట్‌పల్లి సహకార సంఘం చైర్మన్ సింగిడి రాజేశ్వర్‌రెడ్డి(70) మృతిచెందారు. వివరాలు ఇలా.. దొన్కల్ గ్రామానికి చెందిన రాజేశ్వర్‌రెడ్డి గురువారం బైక్‌పై పొలానికి వెళ్లాడు. కొద్దిసేటికే ఇంటికి తిరిగి బయలుదేరాడు. దొన్కల్ శివారులోని హైవేపై అతడి బైక్‌ను మెట్‌పల్లి నుంచి ఆర్మూర్ వైపు వెళుతున్న పశువుల వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కూతురు రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. రాజేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆమెరికాలో ఉండటంతో అంత్యక్రియలు జరగడానికి ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు.

క్రైం కార్నర్