
ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
మోపాల్: మండలకేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నారులు జాతీయ జెండాను ఎగురవేశారు. జెండాలను చేతబూని దేశభక్తి, జాతీయ భావం, దేశ ప్రాధాన్యతను పిల్లలకు బీజేపీ నాయకులు నవీన్‌రెడ్డి తెలియజేశారు. చిన్నారులు అక్షర, ఆకృతి, ఖుషి, చిన్ను, కన్నయ్య, అభినయ్, సంజీవ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లి మండల కేంద్రంలో..
ధర్పల్లి: మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం తిరంగా యాత్ర చేపట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మువ్వన్నెల పతాకాలతో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, గంగాదాస్, కర్క గంగారెడ్డి, శ్రీకాంత్, వెంకటేష్ పాల్గొన్నారు.

ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ