
దరఖాస్తుల ఆహ్వానం
సిరికొండ: మండలంలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి పర్వీన్‌బేగం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్, హిందీ పోస్టులకు టెట్ ఉత్తీర్ణులై బీఏ బీఈడీ, సోషల్ మెథడాలజీ, ఎంపీటీ, హిందీ మెథడాలజీ కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికై న వారికి గెస్ట్ ఫ్యాకల్టీగా నెలకు రూ.18 వేల వేతనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ధృవపత్రాలతో ఈనెల 20లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
నిజామాబాద్ రూరల్: విద్యార్థి దశ నుంచే సాహిత్యంపై మక్కు వ పెంచుకోవాలని భావకవి, కవిత్వ శిక్షకుడు, వైదిక పురో హితుడు తిరుమల శ్రీనివాస్ ఆర్య తెలిపారు. మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల యజమాన్యం పిలుపు మేరకు గురువా రం ఆయన పాఠశాలను సందర్శించారు. అనంత రం విద్యార్థులకు సాహిత్యంపై మక్కువ పెంచే అ నేక విషయాలు తెలియజేశారు. పాఠశాల యజమాన్యం, నిర్వహకులు ఆచార్యుల బృందం ఆయనను సన్మానించారు.